- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓయూలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఇద్దరు ఓయూ విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకుని ప్రభుత్వానికి, టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లీకేజీ ఘటనకు బాధ్యుడైన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని, లీకేజీకి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఎంఎస్ఎఫ్ విద్యార్థి శ్రీకాంత్, బీసీ సంఘం విద్యార్థి ఓంకార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story






