- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే చోట రెండు రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు స్పాట్ డెడ్
కర్నూల్ జిల్లాలో ఒకేచోట జరిగిన రెండు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఈ ప్రమాదాలు జరిగాయి.

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లాలో ఒకే చోట జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. చెన్నమ్మ సర్కిల్ వద్ద జరిగిన ఈ ప్రమాదాలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వేగంగా వచ్చిన ఓ లారీ పాదచారిని ఢీ కొట్టగా అతను అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే అతడికి సహాయం చేసేందుకు వెళ్లారు. అప్పటికే చనిపోవడంతో పోలీసులు, అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. అంతలోనే మరోలారీ వేగంగా వారిపైకి దూసుకొచ్చింది.
ఇలా రోడ్డుప్రమాదంలో ఒకరికి సహాయం చేయబోయి మరో ఇద్దరు వ్యక్తులు కూడా స్పాట్లో చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ప్రమాదాలను కళ్లారా చూసినవారు.. మంచి అన్నివేళలా కాపాడుదంటూ.. కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ప్రమాదాలకు కారణమైన రెండులారీల డ్రైవర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాలలో మరో ప్రమాదం
మరోవైపు నంద్యాల వద్ద జాతీయ రహదారిపై మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. టైరు పేలిపోవడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు అధికవేగంతో వెళ్తుండటం వల్లే డ్రైవర్ పట్టుకోల్పోయినట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






