- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీడీ నగర్ లో ఒకేరోజు ఇద్దరు మృతి
దిశ, పాలకుర్తి : మండల పరిధిలోని జీ.డీ. నగర్ లో విషాదం చోటు చేసుకుంది. బీసీ కాలనీలో నివాసం ఉంటున్న నలవేణి నరేష్(37) గురువారం అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చి మృతి చెందాడు.

X
దిశ, పాలకుర్తి : మండల పరిధిలోని జీ.డీ. నగర్ లో విషాదం చోటు చేసుకుంది. బీసీ కాలనీలో నివాసం ఉంటున్న నలవేణి నరేష్(37) గురువారం అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చి మృతి చెందాడు. ఇతను లారీ డ్రైవర్ గా పని చేస్తుంటాడు. నరేష్ మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక అదే బీసీ కాలనీలో నివాసం ఉండే స్వర్గీయ బంక రవి కుమార్తె శ్రావణి(17) అనారోగ్యంతో చనిపోయింది. ఈ చిన్నారి జీ.డీ.నగర్ లో బీసీ కాలనీలో యూనివర్సల్ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతుంది. గతంలో కూడా గుండె కు సంబంధిత వ్యాధితో బాధపడింది. ఈ రెండు మరణాలతో బీసీ కాలనీవాసులు శోక సంద్రంలో మునిగిపోయారు.
Next Story






