- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గతంలోనే రెండు ఓవర్ స్పీడ్ చలాన్లు.. నేడు ఆరుగురి ప్రాణాలు తీసిన అదే అతివేగం!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై శుక్రవారం మధ్యాహ్నం అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై శుక్రవారం మధ్యాహ్నం అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అతివేగం ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సిరిసిల్లకు చెందిన ఒకే కుటుంబం 'TS 23 F 2298' నంబర్ గల కారులో పెద్దగోల్కొండ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ORR ఎగ్జిట్-16 సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు మరియు ఇద్దరు చిన్నారులు ఉండటం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నింపింది. మరో మహిళ తీవ్రంగా గాయపడగా, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
అతివేగమే శాపమా?..
ప్రమాదానికి గురైన కారు బొల్లి శివకుమార్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ప్రాథమిక దర్యాప్తులో కారు అతివేగంగా ఉండటమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కారుపై ఇప్పటికే రెండు 'ఓవర్ స్పీడ్' (Over Speed) చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. లారీని ఢీకొట్టిన ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతివేగం వల్ల కలిగే ప్రమాదాలపై పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.






