- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాటేస్తున్న కరెంటు తీగలు.. పాతబస్తీలో మరో ఇద్దరు దుర్మరణం
నగర పరిధిలోని రామాంతపూర్ గోఖలేనగర్‌లో ఆదివారం రాత్రి విద్యుత్ షాక్‌తో ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన మరువక ముందే పాతబస్తీ (Old City)లో మరో విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నగర పరిధిలోని రామాంతపూర్ గోఖలేనగర్‌లో ఆదివారం రాత్రి విద్యుత్ షాక్‌తో ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన మరువక ముందే పాతబస్తీ (Old City)లో మరో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బండ్లగూడ (Bandlaguda)లో మంగళవారం తెల్లవారుజామున ఇద్దురు యువకులు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షంలో వినాయకుడి విగ్రహం తీసుకెళ్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌పై ఉన్న విగ్రహం కిరీటానికి హై టెన్షన్ వైర్లు తగిలాయి. ఈ దుర్ఘటనలో టోనీ (21), వికాస్ (20) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు అఖిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అతడి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






