సీతమ్మధారలో దారుణం.. మూగ బాలికపై గ్యాంగ్ రేప్

by Naga Rani Yarlagadda |

విశాఖ నగర పరిధిలోని సీతమ్మధారలో (Seethamma Dhara) దారుణ ఘటన చోటుచేసుకుంది.

సీతమ్మధారలో దారుణం.. మూగ బాలికపై గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ నగర పరిధిలోని సీతమ్మధారలో (Seethamma Dhara) దారుణ ఘటన చోటుచేసుకుంది. మూగబాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగిన దారుణం గురించి చెప్పింది. దీంతో బాలికను చెంత తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ శంఖబ్రత బాగ్చీ ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. బాలిక చెప్పిన ఆధారాలతో నిందితుల కోసం గాలించి.. ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story