బీజాపూర్ జిల్లాలో కొనసాగుతోన్న ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-03 06:05:39  IST  )

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

బీజాపూర్ జిల్లాలో కొనసాగుతోన్న ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో భద్రతా బలగాలు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న పక్కా సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం సుమారు 5.30 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు భీకరంగా ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు భద్రతా బలగాలకు లభ్యమయ్యాయి. అయితే, ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండటం, జవాన్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎన్‌కౌంటర్ జరిగిన స్పాట్‌ను పోలీసులు ఇంకా బయటకు వెల్లడించనట్లుగా తెలుస్తోంది.

Next Story