- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైలు ఢీకొని ఇద్దరు మృతి
by Kema Shiva Kumar |
రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

X
దిశ, తూప్రాన్ : రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. కామారెడ్డి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ దగ్గర్లో పట్టాలలో రెండు మృతదేహాలు పడి ఉన్నట్లుగా సమాచారం అందిందని తెలిపారు. ఘటనా స్థలికి చేరుకొని మృతి చెందిన ఇద్దరిలో ఒకరు బ్రాహ్మణపల్లి గ్రామానికే చెందిన యాదగిరిగా, మరో మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉన్నందున వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహలను పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి రైల్వే ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
Next Story






