- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మూర్ లో బైకు- ఆటో ఢీ.. ఇద్దరు మృతి
దిశ, ఆలూర్ : ఆర్మూర్ పట్టణ శివారులోని అంకాపూర్ గ్రామ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృ

X
దిశ, ఆలూర్ : ఆర్మూర్ పట్టణ శివారులోని అంకాపూర్ గ్రామ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో పాటు మరికొందరికీ గాయాలైన సంఘటన ఆలూర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఆర్మూర్ వైపు నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆటో (TS 16 UB 3745) నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న బుల్లెట్ బైకు ఎదురెదురుగా రెండు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బుల్లెట్ బైకు నడిపిన సాయి ప్రసాద్ (21), ఆటోలో ప్రయాణిస్తున్న వనం సంధ్యారాణి అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






