- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ ఢీ కొని ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు
దిశ, సత్తుపల్లి : ద్వి చక్రవాహనం పై వెళ్తున్న టూ వీలర్ ను వెనుక నుంచి లారీ ఢీ కొనడంతో టూ వీలర్ పై ప్రయాణిస్తున్న

దిశ, సత్తుపల్లి : ద్వి చక్రవాహనం పై వెళ్తున్న టూ వీలర్ ను వెనుక నుంచి లారీ ఢీ కొనడంతో టూ వీలర్ పై ప్రయాణిస్తున్న అక్కా, తమ్ముడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు గాయపడ్డాడు. ఈ సంఘటన సత్తుపల్లి పట్టణం శివారులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం సూర్య బంజర్ తండాకు చెందిన పుచ్చ కృష్ణయ్య, రమ్య దేవి దంపతుల కుమార్తె తేజస్విని (21) చింతలపూడి మండలం కండ్రి క వారి గూడెం గ్రామానికి చెందిన తోట మధు తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. మృతురాలు తేజస్విని తమ్ముడు పుచ్చ దేవేందర్ (14) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారెప్ప గూడెం, చీపురు గూడెం ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల క్రిస్మస్ సెలవులకు ఇంటికి రావడంతో తమ్ముడు, తల్లిదండ్రులని చూసి వెళ్లేందుకు వచ్చిన భార్య, భర్తలు మధు, తేజస్విని, తిరుగు ప్రయాణంలో పెనుబల్లి మండలం సూర్య బంజర నుంచి బయలుదేరి సత్తుపల్లి పట్టణ శివారు తమ్మిలేరు వంతెన మీదికి చేరుకోవటంతో ఖమ్మం నుంచి అశ్వరావుపేట వైపు వెళుతున్న లారీ వెనుక నుంచి టూవీలర్ ను ఢీకొనడంతో టూ వీలర్ పై వెనక ఉన్న తేజస్విని, తమ్ముడు, దేవేందర్ లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తోట మధు ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలయ్యాడు. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన మృతురాలు తేజస్విని, దేవేందర్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ సంఘటన పై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు,.






