ఇద్దరు డ్రైవర్ల మధ్య గొడవ.. రెండు లారీల మధ్యలో ఇరుక్కుని మృతి

by Naga Rani Yarlagadda |

నార్కట్ పల్లి సమీపంలో విజయవాడ - హైదరాబాద్ హైవేపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం చెందారు.

ఇద్దరు డ్రైవర్ల మధ్య గొడవ.. రెండు లారీల మధ్యలో ఇరుక్కుని మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి సమీపంలో హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై నల్గొండ ఎక్స్ రోడ్ ఫ్లై ఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం చెందారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోజో ట్రావెల్స్ బస్సు ఓ లారీని ఓవర్ టేక్ చేసి ముందుకెళ్లగా.. అది లారీని తాకింది. దీంతో లారీ డ్రైవర్ బస్సును ఆపి రోడ్డుపై ఘర్షణకు దిగాడు. బస్సు డ్రైవర్లు, లారీ డ్రైవర్ మధ్య వాగ్వాదం జరుగుతుండగా.. అతి వేగంగా వచ్చిన మరో లారీ ఆగిఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీల మధ్య చిక్కుకుని డ్రైవర్లు బంగారయ్య, శ్రీనివాస్ లు మరణించారు. బస్సు క్లీనర్, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు దానిని క్లియర్ చేశారు. క్లీనర్ సురేష్ చెప్పిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story