- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ వద్దనున్న ఔటర్ రింగ్ రోడ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

దిశ, మేడ్చల్: శామీర్‌పేట్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్‌పై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కంటైనర్ లారీ డ్రైవర్ ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. మేడ్చల్ నుండి శామీర్‌పేట్ వైపు వెళ్తున్న కారు శామీర్‌పేట్ ఎగ్జిట్-7 వద్ద ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఆగింది. కారులో ప్రయాణిస్తున్న కొంతమంది వ్యక్తులు కారును పక్కకు నిలిపి వెనకాల నిలబడి భోజనం చేస్తుండగా, వేగంగా వచ్చిన కంటైనర్ లారీ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనకాల ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.






