- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృతి
by Kema Shiva Kumar |
పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని కాసంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది.

X
దిశ, గన్నేరువరం : పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని కాసంపేట గ్రమంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బొజ్జ కొమురయ్య, రైతు ఎప్పటిలాగే తన ఎడ్లను చెట్టు కింద కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగు ఎడ్లపై పడడంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో రైతు కొమురయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. వ్యవసాయంలో తనతో చేదోడు వాదోడుగా ఉండే సుమారు రూ.1.50 లక్షలు విలువ చేసే ఎడ్లు మృతి చెందాయంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే ఆర్థిక సాయం అందజేసి తనను ఆదుకోవాలని అధికారులను వేడుకున్నారు. ఈ మేరకు పశు వైద్యాధికారి సాంబారావు ఘటనా స్థలానికి పరిశీలించి పంచనామ నిర్వహించారు.
Next Story






