- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు మండలాల్లో అలజడి సృష్టించిన చైన్ స్నాచర్లు.. ఫొటోలు విడుదల చేసిన పోలీసులు
చైన్ స్నాచర్లు మూడు మండలాల్లో అలజడి సృష్టించి, మహిళ మెడలో నుంచి మూడు తులాల విలువ చేసే బంగారు గొలుసును అపహరించుకుపోయిన సంఘటన నిజామాబాద్

దిశ, భిక్కనూరు: చైన్ స్నాచర్లు మూడు మండలాల్లో అలజడి సృష్టించి, మహిళ మెడలో నుంచి మూడు తులాల విలువ చేసే బంగారు గొలుసును అపహరించుకుపోయిన సంఘటన నిజామాబాద్(Nizamabad) జిల్లా భిక్కనూరు(Bikkanur) మండలం జంగంపల్లి వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఒకే గ్యాంగ్ వచ్చి వేర్వేరుగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడిందా...? లేక గ్రూపులుగా వచ్చి, నెంబర్ ప్లేట్లు లేని బైకులపై తిరుగుతూ హల్ చల్ చేశారా అన్నది కరెక్ట్‌గా తెలియక పోయినప్పటికీ, కొన్ని గంటల వ్యవధిలో చైన్ స్నాచింగ్ అటెంప్ట్‌లు జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. రథాల రామారెడ్డి చెందిన కుమ్మరి మణెవ్వ, ఆమె కుమారుడు భాస్కర్ రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ పని ముగించుకుని బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు.
అయితే వీరి వెనకాలే బ్లూ కలర్ బైక్‌పై ఇద్దరు హెల్మెంట్లు ధరించిన వ్యక్తులు, వారి వెనకాలే వచ్చి వారి బైకును ఓవర్టేక్ చేసి వచ్చి, బసవన్నపల్లి ఎటువైపు అంటూ అడిగారు. మాకు కూడా సరిగ్గా తెలవదని చెప్పగా, మాటల్లో పెట్టి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును తెంపుకొని పరారయ్యారు. ఇదే సమయంలో గంటల వ్యవధిలో రాజంపేట, దోమకొండ మండలం గొట్టుముక్కుల గ్రామాల్లో కూడా మరో ఇద్దరు మహిళలపై అటెంప్ట్ జరిగినప్పటికీ వారు అరుపులు కేకలు పెట్టడంతో తప్పించుకుపోయినట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఇంచార్జ్ ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు చైన్ స్నాచర్ల కోసం విస్తృతంగా గాలించారు. సీసీ ఫుటేజ్‌లో నిక్షిప్తమైన చైన్ స్నాచర్ల అనుమానితుల ఫొటోలు, రాత్రి విడుదల చేశారు. ఎవరికైనా అనుమానితుల వివరాలు తెలిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.






