- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ స్తంబాలు మీద పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి..
సిమెంట్ స్తంభాలు మీదపడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన సోమవారం కౌటాల మండలంలోని వైగాం గ్రామం వద్ద జరిగింది.

X
దిశ, చింతలమానేపల్లి : సిమెంట్ స్తంభాలు మీదపడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన సోమవారం కౌటాల మండలంలోని వైగాం గ్రామం వద్ద జరిగింది. పూర్తివివరాల్లోకెళితే బెజ్జూరు మండలంలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన బుర్రి అనిల్ (24), బుర్రి వసంత్ (26) అనే ఇద్దరు కూలీలు ట్రాక్టర్ ట్రాలీ పై విద్యుత్ స్థంబాలు తరలిస్తున్నారు.
మార్గమద్యంలో ట్రాలీ బోల్తా పడడంతో అందులో ఉన్న విద్యుత్ స్థంబాలు మీదపడి బుర్రి అనిల్, బుర్రి వసంత్ అనే ఇద్దరు యువకూలీలు అక్కడకక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముంజంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయల అలుముకున్నాయి.
Next Story






