- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి
చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని విట్టోలి గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, ముధోల్ : చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని విట్టోలి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని బాలాజీ అనే వ్యక్తికి చెందిన ఇంటికి తానూర్ మండలంలోని కొలూరు గ్రామానికి చెందిన నిఖిల్(15) మహారాష్ట్రలోని నాందేడ్ కి చెందిన స్వరాజ్(14) గత ఐదు రోజుల క్రితం వచ్చారు. ఇద్దరు బాలురు ఆడుకోవడానికి గ్రామ సమీపంలోని రంగరికుంట చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందారు. మృతులు ఇద్దరు బాలురు తమ బంధువుల ఇంటికి సెలవులు ఉండడంతో వచ్చారు. ప్రమాదవశాత్తు రంగరి కుంటలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయల అనుముకున్నాయి. మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఆడుకుంటున్నా సమయంలోనే మృత్యు కబళించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్సై బిట్ల పెర్సిస్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుని అక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






