- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు
by Kema Shiva Kumar |
రెండు బైకులు ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన కేశవపట్నంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

X
దిశ, శంకరపట్నం : రెండు బైకులు ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన కేశవపట్నంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గూళ్ల రాజు, బొజ్జ శ్రీనివాస్ కేశవపట్నం మెయిన్ రోడ్డు నుంచి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ గుర్తు తెలియని బైక్ వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న రాజు, శ్రీనివాస్ లకు గాయాలు కాగా, స్థానికులు వారిని 108 వాహనంలో ఈఎంటీ సతీష్ రెడ్డి, పైలట్ గోపికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిద్దరిని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు 108 వాహన సిబ్బంది తెలిపారు.
Next Story






