బాలికలను అపహరించి అత్యాచార యత్నం.. ఇద్దరు నిందితుల అరెస్టు

by Batti.Sumithra |

నిర్మల్ పట్టణంలోని సోఫినగర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఇద్దరు బాలికలను అపహరించి, అత్యాచార యత్నం చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

బాలికలను అపహరించి అత్యాచార యత్నం.. ఇద్దరు నిందితుల అరెస్టు
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని సోఫినగర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఇద్దరు బాలికలను అపహరించి, అత్యాచార యత్నం చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులు అబ్బాస్ ఖాన్, షేక్ కలీమ్‌లను నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాల మేరకు, ఇద్దరు బాలికలను అపహరించి వారి పై అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నించినట్లు నిర్ధారణ కావడంతో, నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. బాధిత బాలిక ఎస్సీ వర్గానికి చెందినది కావడంతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. సకాలంలో నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసిన పోలీసులను అభినందిస్తున్నారు.

Next Story