- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాపంగా మారిన పాపులారిటీ.. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ నాగలక్ష్మి హత్యకేసులో ట్విస్ట్
సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ చీరల వ్యాపారి నాగలక్ష్మి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చెన్నై లోని నంగనల్లూరులో నాగలక్ష్మి నివాసం ఉంటున్నారు. నాగలక్ష్మి భర్త సుబ్రమణ్యం కాగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ చీరల వ్యాపారి నాగలక్ష్మి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చెన్నై లోని నంగనల్లూరులో నాగలక్ష్మి నివాసం ఉంటున్నారు. నాగలక్ష్మి భర్త సుబ్రమణ్యం కాగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రష్యాలో ఎంబీబీఎస్ చదువుతుండగా, చిన్న కుమారుడు చెన్నై లోనే డెంటల్ కోర్సు చేస్తున్నాడు. ఇక గత కొంతకాలంగా నాగలక్ష్మి, భర్త సుబ్రమణ్యం మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. రెండేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా భర్త ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఇటీవలే ఇంటికి రాగా మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కొడవలితో సుబ్రమణ్యం భార్యను హత్య చేశాడు.
ఆ తరవాత తన కుమారుడికి.. అమ్మ నేను చనిపోతున్నాం ఇంట్లో అన్నం వండాను వచ్చి తిను అంటూ మెసేజ్ పెట్టాడు. తరవాత గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హత్యకు కారణం భార్య సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడమే అని తెలుస్తుంది. సుబ్రమణ్యం ఎలాంటి పనిచేస్తుండగా నాగలక్ష్మి సోషల్ మీడియాలో చీరలకు సంబంధించిన వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యింది. ఈమెకు ఇన్ స్టాలో మూడు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. శ్రీసాయి సిల్క్స్ పేరుతో ఎక్కువగా నాలగక్ష్మి పట్టు చీరలను అమ్ముతుంది. ఇక అలాంటి మహిళను భర్త హత్య చేయడంతో ఇప్పుడు ఫాలోవర్స్ షాక్ అవుతున్నారు.






