- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
15ఏళ్ల ప్రేమ.. కారులో దొరికిన డెడ్ బాడీలు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్
ప్రేమికుల దినోత్సవం రోజునే జంట తుపాకీతో కాల్చుకుని మృతి చెందడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే ప్రియుడు మొదట ప్రియురాలిని హతమార్చి తాను కాల్చుకున్నట్టు తేలింది.

దిశ, వెబ్ డెస్క్: నోయిడాలో లాక్ చేసిన కారులో యువజంట డెడ్ బాడీలు దొరకడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం రోజునే జంట తుపాకీతో కాల్చుకుని మృతి చెందడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే ప్రియుడు మొదట ప్రియురాలిని హతమార్చి తాను కాల్చుకున్నట్టు తేలింది. చనిపోయే ముందు మృతుడు సుమిత్ 32 తన కుటుంబ సభ్యులకు పంపిన సందేశంంలో కీలక విషయాలను పేర్కొన్నాడు.
సందేశంలో.. నేను నా జీవితాన్ని ముగించబోతున్నాను. నా చావుకు కారణం ఆ రేఖనే. మా 15ఏళ్ల రిలేషన్‌షిప్‌లో ఆమె నన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మరో వ్యక్తి పెళ్లి చేసుకోబోతుంది. ఆమె నన్ను మోసం చేసినందుకే చనిపోతున్నా అంటూ పేర్కొన్నాడు. మెసేజ్ పంపిన అనంతరం సుమిత్ లాక్ చేసిన కారులో తన ప్రియురాలిని తుపాకీతో కాల్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
కారులో రెండు డెడ్ బాడీలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుల శరీరాల్లో బుల్లెట్ గాయాలను గుర్తించారు. ఇదిలా ఉంటే సుమిత్ ఢిల్లీకి చెందినవాడు కాగా రేఖ నోయినా ప్రాంతానికి చెందిన యువతి. గత పదిహేనేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని, ఆ విషయం ఇరు కుటుంబాలకు తెలుసని మృతుల బంధువులు చెబుతున్నారు.






