రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి కేసులో ట్విస్ట్!

by Ajay Maddhiboyina |

రైలు నుండి కింద‌ప‌డి న‌వ దంప‌తులు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా వంగ‌ప‌ల్లి ఆలేరు రైలు మార్గంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి కేసులో ట్విస్ట్!
X

దిశ‌, వెబ్ డెస్క్: రైలు నుండి కింద‌ప‌డి న‌వ దంప‌తులు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా వంగ‌ప‌ల్లి ఆలేరు రైలు మార్గంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతులు ఏపీలోని పార్వతీపురం మ‌న్యం జిల్లా గ‌రుగుబిల్లి మండ‌లం రావుప‌ల్లికి చెందిన కోరాడ సింహాచ‌లం, భ‌వానిగా అధికారులు గుర్తించారు. వీరికి రెండు నెల‌ల క్రిత‌మే వివాహం కాగా హ‌ద‌రాబాద్ జ‌గ‌ద్గిరిగుట్ట‌లో నివాసం ఉంటున్నారు. విజ‌య‌వాడ‌లోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మ‌చిలీప‌ట్నం ఎక్స్ ప్రెస్ రైలులో బ‌య‌లుదేర‌గా వంగపల్లి రైల్వేస్టేషన్ దాటిన తర్వాత డోర్ వ‌ద్ద నుండి కింద‌ప‌డి మ‌ర‌ణించారు.

అయితే వీరిద్ద‌రూ ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించార‌ని అంతా అనుకున్నారు. కానీ ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. రైలు ప్ర‌యాణంలో భార్య భ‌ర్త‌లు భ‌వానీ సింహాచ‌లం గొడ‌వ‌ప‌డ్డారు. భ‌వానీ రైలు నుండి దూకుతాన‌ని బెదిరిస్తుంటే సింహాచ‌లం ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తోటి ప్రయాణికుడు రికార్డ్ చేశాడు. ఈ క్రమంలో క్షణికావేశంలో భవానీ రైలు నుండి దూకేసింది. భవానీ దూకడంతో ఆమె కోసం సింహాచలం సైతం రైలు నుండి దూకేశాడు. రైలు వేగంతో ఉండటం వల్ల ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.

Next Story