IPS ఆఫీసర్ సూసైడ్ కేసులో ట్విస్ట్.. DGPని అరెస్ట్ చేయాలని భార్య డిమాండ్

by Gantepaka Srikanth |

హరియాణా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వై.పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

IPS ఆఫీసర్ సూసైడ్ కేసులో ట్విస్ట్.. DGPని అరెస్ట్ చేయాలని భార్య డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: హరియాణా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వై.పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్త ఆత్మహత్యకు హరియాణా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాలే కారణమని పురాణ్ కుమార్ భార్య, IAS అధికారిణి అమ్నీత్ పి.కుమార్ ఆరోపించారు. వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఛండీగఢ్ పోలీసులకు అమ్నీత్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 7న ఛండీగఢ్‌లోని తమ నివాసంలో పురాణ్ కుమార్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పురాణ్ కుమార్ ఇంట్లో 8 పేజీల సూసైడ్ కూడా పోలీసులు లెటర్ గుర్తించారు. డీజీపీ, ఏడీజీపీ, ఎస్పీ ర్యాంకులకు చెందిన 10 మంది సీనియర్ అధికారులు మానసిక వేధింపులకు గురిచేశారని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఆయన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు, సహోద్యోగులు తనను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని అవమానించారని లేఖలో పురాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story