తెలంగాణలో దారుణం.. వాట్సాప్ ద్వారా ఆపరేషన్ చేయించిన డాక్టర్.. కవలలు మృతి

by Gantepaka Srikanth |

తెలంగాణ(Telangana)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం(Medical Negligence) కారణంగా అప్పుడే పుట్టిన కవలలు మృతిచెందారు.

తెలంగాణలో దారుణం.. వాట్సాప్ ద్వారా ఆపరేషన్ చేయించిన డాక్టర్.. కవలలు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం(Medical Negligence) కారణంగా అప్పుడే పుట్టిన కవలలు మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఓ గర్భిణి(Pregnant) పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చింది. ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేరు. నొప్పులు మరింత తీవ్రతరం కావడంతో నర్సులు వాట్సాప్‌లో డాక్టర్‌కు వీడియో కాల్ చేశారు. డాక్టర్ సూచనల మేరకు నర్సులు గర్భిణికి ఆపరేషన్ చేశారు. వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావం అయింది. ఆ కొద్ది సేపటికే కవలలు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం విజయలక్ష్మి ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బంధువుల ఆందోళనతో విషయం తెలుసుకున్న పోలీసులు నర్సులు, డాక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఇటీవలే ఏపీలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవలపిల్లలు, తల్లి మృతి చెందిన విషయం తెలిసిందే. వివాహిత పురిటినొప్పులతో ఆసుపత్రికి వచ్చారు. అక్కడి వైద్యులు పరీక్షించి కడుపులో ఉన్న కవలలు మృతి చెందారని చెప్పి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. కడుపులో వీరు చనిపోయి మూడు రోజులు అవడంతో తల్లికి ఇన్‌ఫెక్షన్‌ సోకింది. దీంతో ఆమె కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో బంధువులు ఆమె మృతదేహంతో ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతున్న ఈ తరహా ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.

Next Story