- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కార్పియోను ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురు పోలీసులు దుర్మరణం
హర్యానాలోని నూహ్ జిల్లా KMP ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పోలీసులు మరణించారు.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసులు దుర్మరణం పాలైన విషాద ఘటన హర్యానా (Haryana)లోని నూహ్ జిల్లా పరిధిలో KMP ఎక్స్‌ప్రెస్‌వేపై ఇవాళ చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) పోలీస్ టీమ్ ప్రయాణిస్తున్న స్కోర్పియో వాహనాన్ని తావడు సమీపంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు పోలీసులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ (Firozabad) జిల్లాకు చెందిన పోలీసులుగా గుర్తించారు. ఓ నిందితుడిని పట్టుకునే క్రమంలో రాజస్థాన్, హర్యానా వైపు దర్యాప్తు కోసం వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఎక్స్‌ప్రెస్‌వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వాహనం నుంచి బయటకు తీశారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు. ఈ మేరకు నూహ్ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.






