- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్వర్టును ఢీకొని ట్రాలీ ఆటో డ్రైవర్ దుర్మరణం
అదుపుతప్పిన ట్రాలీ ఆటో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టుకు ఢీకొని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన భైంసా మండలంలో చోటు చేసుకుంది.

X
దిశ, భైంసా : అదుపుతప్పిన ట్రాలీ ఆటో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టుకు ఢీకొని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన భైంసా మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన ప్రకారం భైంసా పట్టణం గణేష్ నగర్ కు చెందిన సాయినాథ్(30) అనే ఆటో డ్రైవర్ శుక్రవారం ట్రాలీ ఆటోలో మందు సంచులను బాసరకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో భైంసా బాసర రహదారిలో గల దెగం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన గల కల్వర్టుకు ఆటోను ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఢీకొట్టాడు. దాంతో సాయినాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
- Tags
- driver die
Next Story






