నవరాత్రి జాతరలో దారుణం.. గిరిజన బాలికలను కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-10 07:58:06  IST  )

నవరాత్రి జాతర సమయంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నవరాత్రి జాతరలో దారుణం.. గిరిజన బాలికలను కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: నవరాత్రి జాతర సమయంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతరకు వెళ్లి తిరిగి వస్తున్న బాలికల్ని స్కార్పియోలో కిడ్నాప్ చేసిన దుండగులు అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. గర్వ్హా జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంకా పీఎస్ పరిధిలోగల నాగరి విలేజ్ కు చెందిన ముగ్గురు గిరిజన బాలికలు తమ స్నేహితులతో కలిసి నవరాత్రి జాతరకు వెళ్లారు. జాతరను ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. దారిలో ఒక స్కార్పియో వెహికల్ వారి వద్ద ఆగింది.

ఆ వాహనంలో నుంచి నలుగురు వ్యక్తులు దిగి.. ముగ్గురు బాలికల్ని వాహనంలో ఎక్కించుకున్నారు. వారిని అడ్డుకునేందుకు బాలికలతో ఉన్న యువకులు ప్రయత్నించగా.. వారిని తీవ్రంగా కొట్టి తరిమేశారు. బాలికల్లో ఒకరు తనను వదిలేయాలని ప్రాధేయపడగా.. ఆమెను దారిలోనే వదిలేసిన నిందితులు.. మిగతా ఇద్దరినీ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. మర్నాడు ఉదయానికి ఇంటికి చేరుకున్న బాలికలు.. తల్లిదండ్రులకు జరిగిన ఘోరాన్ని చెప్పారు. వెంటనే రంకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికల స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు మండీశ్ యాదవ్, శంకర్ యాదవ్, ఓం ప్రకాశ్ యాదవ్, మరో వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఒకరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read More: హైదరాబాద్‌లో దారుణం.. గంజాయి మత్తులో 8 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి

Next Story