- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్.. కాల్పుల్లో ముగ్గురు మృతి
గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన దేశంలో చిచ్చు రాజేసింది. గిరిజనులు, వలస బెంగాలీల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్‌డెస్క్: గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన దేశంలో చిచ్చు రాజేసింది. గిరిజనులు, వలస బెంగాలీల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అల్లర్లు, ఘర్షణలను ఆపేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బంది, పోలీసులు సైతం గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. భారత్ - మయన్మార్ సరిహద్దులకు సమీపంలో ఉన్న చిట్టగాంగ్ వద్ద ఖగ్రాచారి జిల్లాలో గత మంగళవారం (సెప్టెంబర్ 22) 8వ తరగతి చదువుతున్న గిరిజన బాలిక ట్యూషన్ కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.. సామూహిక అత్యాచారానికి గురైంది.
బాలిక ఇంటికి రాకపోవడంతో వెతికిన కుటుంబ సభ్యులు ఆ రోజు అర్థరాత్రివేళ అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటనపై స్థానిక గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శనివారం (సెప్టెంబర్ 27) నుంచి నిరసనలు ఉద్ధృతం చేశారు. రహదారులకు చెట్లను అడ్డు వేసి, టైర్లు కాచి దిగ్బంధం చేశారు. ఆదివారం ఆందోళనలు మరింత హిసాత్మకంగా మారగా.. ఇతర ప్రాంతాలకూ అల్లర్లు వ్యాపించాయి.
దీంతో వలస వచ్చిన బెంగాలీలు, ఆదివాసీతెగలకు మధ్య గొడవ జరిగింది. పరస్పరం దాడులు చేసుకోగా.. కాల్పుల్లో ముగ్గురు మరణించారు. దీనిపై డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ అహ్సాన్ హబీబ్ మీడియాకు తెలిపారు. వారు ఏ తెగకు చెందిన వారో గుర్తుంచాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఖగ్రాఛారి టౌన్ సహా పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేసినట్లు చెప్పారు. కాగా.. గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ హోంశాఖ తెలిపింది.






