- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుష్ప సినిమాను తలపించేలా గంజాయి రవాణా..
by Batti.Sumithra |
పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ ఎర్ర చందనం దుంగలను తరలించిన మాదిరిగానే కొంత మంది కేటుగాళ్ళు గంజాయిని సైతం అదే తరహాలో తరలిస్తున్నారు.

X
దిశ, ఇల్లందు : పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ ఎర్ర చందనం దుంగలను తరలించిన మాదిరిగానే కొంత మంది కేటుగాళ్ళు గంజాయిని సైతం అదే తరహాలో తరలిస్తున్నారు. ప్రభుత్వ నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు మంగళవారం ఇల్లందులో ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ సర్వేశ్వరరావు, ఇల్లందు ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇల్లందు మండల పరిదిలోని బొజ్జాయి గూడెం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పట్టుకున్నారు. ఒడిశా నుంచి ఇల్లందు మీదగా తరలిస్తున్న క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న 25 కిలోల గంజాయితో ఒక కారు, ఇరువురిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిషేధిత గంజాయిని అక్రమంగా తరలించిన, విక్రయాలు జరిపిన సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి నిర్ములనలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
Next Story






