- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్బులు ఇవ్వాలంటూ హిజ్రాల వికృత చేష్టలు.. వీడియో వైరల్
తెలుగు రాష్ట్రాలలో హిజ్రాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. శుభకార్యం జరిగిందంటే చాలు ఆ ఇంటికి వెళ్లి డబ్బులు అడుగుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలలో హిజ్రాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. శుభకార్యం జరిగిందంటే చాలు ఆ ఇంటికి వెళ్లి డబ్బులు అడుగుతున్నారు. అయితే అలా వెళ్లినప్పుడు ఇచ్చినంత తీసుకుని వెళ్లాలి కానీ వేలకు వేలు కావాలంటూ డిమాండ్ చేయడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బులు ఇవ్వకపోతే వికృత చేష్టలకు పాల్పడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడలో చోటు చేసుకుంది. రాచకొండ సీపీ పరిధిలోని గుర్రంగూడలో ఆదివారం ఓ భూమి పూజ జరగ్గా అక్కడకు కొందరు హిజ్రాలు చేరుకున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతో వికృత చేష్టలు చేస్తూ యజమానులను బూతులు తిట్టారు.
హిజ్రాలు దౌర్జన్యం చేసిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రాచకొండ సీపీని ట్యాగ్ చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. హిజ్రా సంఘాలకు కౌన్సిలింగ్ నిర్వహించి శుభకార్యాల పూట ప్రజలు సంతోషంగా ఉండేలా చూడాలని కోరారు. ఈ అసభ్యకర పోకడకు ముగింపు పలకాలని కోరారు. నెటిజన్ పోస్టుకు రాచకొండ సీపీ స్పందించారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరగడంతో వారిని ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి మీర్ పేట్ పోలీసులు రిప్లై ఇస్తూ అక్కడకు పోలీసులు వెళ్లారని సమస్య పరిష్కారం అయిందని పేర్కొన్నారు. కానీ నెటిజన్ పోలీసులు అబద్దం చెబుతున్నారని అసలు అక్కడకు ఎవరూ వెళ్లలేదని ఘటనపై కేసు నమోదు చేసుకోలేదని మరోసారి సీపీకి ఫిర్యాదు చేశారు.






