నన్ను పెళ్లి చేసుకుని మోసం చేశాడు..యువకుడి ఇంటి ముందు ట్రాన్స్ జెండర్ నిరసన

by Ajay Maddhiboyina |

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు మోసం చేయడంతో ట్రాన్స్‌జెండర్ (Transgender) అతడి ఇంటి ముందు నిరసనకు దిగింది. ఈ ఘటన కర్నూల్‌లో (Kurnool) చోటు చేసుకుంది.

నన్ను పెళ్లి చేసుకుని మోసం చేశాడు..యువకుడి ఇంటి ముందు ట్రాన్స్ జెండర్ నిరసన
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు మోసం చేయడంతో ట్రాన్స్‌జెండర్ (Transgender) అతడి ఇంటి ముందు నిరసనకు దిగింది. ఈ ఘటన కర్నూల్‌లో (Kurnool) చోటు చేసుకుంది. తనను గణేష్ అనే యువకుడు పెళ్లి చేసుకుని మోసం చేశాడని హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ హాసిని మరికొంతమంది ట్రాన్స్‌జెండర్లతో కలిసి అతడి ఇంటి ముందు నిరసనకు దిగింది. గణేష్ తానూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నామని చెప్పింది. ఐదేళ్లక్రితం గణేష్‌తో తనకు పరిచయం ఏర్పడిందని ఆ తరవాత ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పింది.

ఆ తరవాత మంత్రాలయంలో తనను పెళ్లి చేసుకున్నాడని ఇంట్లో వాళ్లను ఒప్పించి ఇంటికి తీసుకెళతానని నమ్మించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమలో ఉన్నప్పుడు గణేష్ తన వద్ద లక్షాయాభై వేల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించింది. అతడికి లాప్ టాప్, ఐఫోన్ కూడా కొనిచ్చానని చెప్పింది. మాయ మాటలు చెప్పి తనను గణేష్ వలలో వేసుకున్నాడని హాసిని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తను ట్రాన్స్‌జెండర్ అని, పిల్లలు పుట్టరు అని చెప్పినా గణేష్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని చెప్పింది. 2024 జూన్‌లో తాము వివాహం చేసుకున్నామని హాసిని చెబుతోంది. గణేష్ తల్లి దండ్రులకు ఫోన్ చేసి చెబితే చంపేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. గణేష్‌తో తాను హైదరాబాద్‌లో కలిసి ఉన్నానని తన వద్ద నుండి వెళ్లిన తరవాత గణేష్‌కు వివాహం చేశారని చెప్పారని తెలిపింది. గణేష్ ఇప్పుడు మోసం చేశాడని తన డబ్బులు తనకు కావాలని డిమాండ్ చేస్తోంది.

Next Story