- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోక్సో కేసులపై సైబర్ టిప్ లైన్ పై ముగిసిన శిక్షణ
ఫోక్సో కేసులపై సైబర్ టిప్ లైన్ ద్వారా దర్యాప్తు చేస్తున్న అధికారులకు వారం రోజుల పాటు శిక్షణ తరగతలు నిర్వహించినట్లు సైబర్ సెక్యూరిటి బ్యూరో డీజీ శిఖా గోయాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోక్సో కేసులపై సైబర్ టిప్ లైన్ ద్వారా దర్యాప్తు చేస్తున్న అధికారులకు వారం రోజుల పాటు శిక్షణ తరగతలు నిర్వహించినట్లు సైబర్ సెక్యూరిటి బ్యూరో డీజీ శిఖా గోయాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటి బ్యూరో, ఇండియన్ ఛైల్డ్ ప్రొటెక్షన్, న్యూఢిల్లీ సంయుక్తంగా ఛైల్డ్ సెక్సువల్ ఎక్స్ ప్లోయిటేషన్ అండ్ అబ్యూస్ మెటీరియల్ ( సీఎస్ఈఏఎం) సైబర్ టిప్ లైన్ కేసుల శిక్షణ కార్యక్రమాలు ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. 561 సైబర్ టిప్ లైన్ వివరాల ద్వారా 510 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 26 యూనిట్లకు చెందిన 151 దర్తాప్తు అధికారులకు 204 సైబర్ టిప్ లైన్ ఫైళ్ల పై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఫోక్సో, ఐటీ చట్టం, బీఎన్ఎస్, బీఎన్ఎస్ ఎస్ చట్టాలపై అవగాహన కలింగించినట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ టూల్స్, డివైస్ స్వాధీనం, కంటెంట్ కాపీలపై శిక్షణ ఇచ్చిటనట్లు తెలిపారు.






