- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైన హృదయ విదారక ఘటన మేడ్చల్ (Medchal) జిల్లా కీసర (Keesara)లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైన హృదయ విదారక ఘటన మేడ్చల్ (Medchal) జిల్లా కీసర (Keesara)లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగారం (Nagaram) మునిసిపాలిటీకి చెందిన సరేష్, మౌనిక దంపతులు తమ మూడేళ్ల కుమారుడు శ్రేయాస్‌తో కలిసి బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే భారీ ఈదురుగాలుల కారణంగా ఓ విద్యుత్ తీగ తెగి వారి బైక్‌పై పడింది. ఈ దుర్ఘటనలో మౌనికతో పాటు నరేష్, శ్రేయాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇవాళ ఉదయం మౌనిక చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. భర్త నరేశ్, బాబు శ్రేయాస్‌ల పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
Next Story






