- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసు శాఖలో విషాదం.. ఉరేసుకుని మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీసు శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ దివ్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

దిశ, వెబ్‌డెస్క్/వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ దివ్య శనివారం ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వికారాబాద్ పట్టణ పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా వికారాబాద్ సీఐ రఘు కుమార్ మాట్లాడుతూ.. మృతురాలు దివ్య ధారూర్ పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్నట్లుగా తెలిపారు. దివ్య సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుందని, ఆ లేఖలో ‘తన చావుకు ఎవరూ కారణం కాదని.. నాన్న లేకపోవడం వల్లే మనకు ఇన్ని బాధలు’ అని మాత్రమే ఉందని సీఐ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు, సహచరులు, కాలనీ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే, పోలీస్ శాఖలోని ఉన్నతాధికారుల నుంచి దివ్యపై ఏమైనా ఒత్తిడి ఉందా..? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.






