- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరం నడిబొడ్డున విషాదం.. ఫ్లైఓవర్ పైనుంచి పడి వ్యక్తి మృతి
ఫ్లైఓవర్‌పై నుంచి ఓ వ్యక్తి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నగర పరిధిలోని అంబర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఫ్లైఓవర్‌పై నుంచి ఓ వ్యక్తి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నగర పరిధిలోని అంబర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కాచిగూడ (Kachiguda) నుంచి అంబర్‌పేట్ (Amberpet) వైపునకు ఫ్లైఓవర్ పైనుంచి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడు ఛే నంబర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే అదుపు తప్పి ఫ్లైఓవర్ రైలింగ్‌ను ఢీకొట్టి కింద పడిపోయాడు. ఈ దుర్ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






