- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మల్ లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. సీనియర్ పాత్రికేయుడు పురస్తు

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. సీనియర్ పాత్రికేయుడు పురస్తు సురేందర్ తనయుడు శ్రీ సాయి చరణ్ (22) మోటార్ సైకిల్ పై వెళ్తుండగా పట్టణంలోని ప్రధాన రహదారిపై పాత జూనియర్ కళాశాల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది తీవ్ర గాయాల పాలైన సాయి చరణ్ ను నిర్మల్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నింపింది. ఇటీవలనే నేవీ అకాడమీలో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న సాయిచరణ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరిని కలచివేసింది. తండ్రి సురేందర్ నిర్మల్ జిల్లా కేంద్రంలో సీనియర్ పాత్రికేయుడిగా పని చేస్తున్నారు. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే అనేకమంది ప్రముఖులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకున్నారు. సాయి చరణ్ తల్లిదండ్రులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. అంత్యక్రియలు ఆదివారం ఉదయం పట్టణంలోని నగరేశ్వర వాడలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.






