- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లివేడుకలో అంతులేని విషాదం.. బస్సు ప్రమాదంలో 13 మంది మృతి
బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న దంపతులు కొత్త జీవితం ప్రారంభించాల్సిన వేళ ఘోర ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న దంపతులు కొత్త జీవితం ప్రారంభించాల్సిన వేళ ఘోర ప్రమాదం జరిగింది. 60 మందితో కొండప్రాంతంలో వెళ్తున్న బస్సుపై డ్రైవర్ పట్టు కోల్పోవడంతో లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్పాట్ లో 8 మంది మృతి చెందగా.. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నేపాల్ లోని బైటడి జిల్లా పూర్చౌడి మున్సిపాలిటీ -7 లో భావానే నుంచి బజాంగ్ కు వెళ్తున్న బస్సు (సూపా ప్రావిన్స్ 02 001 Kha 1119) పూర్చౌడి మున్సిపాలిటీ పరిధిలో బడ్గౌన్ మోడ్ వద్ద ప్రమాదానికి గురైంది.
పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న సైన్యం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన 45 మందిని ఆస్పత్రికి తరలించారు. వారిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. కాగా.. వధూవరులు ఆ బస్సులో లేకపోవడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. కుటుంబ సభ్యుల మరణాలతో ఇరువురి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులను కేశవ్ రాజ్ జోషి (40), అశోక్ రాజ్ జోషి (13), బసంత జోషి (35), బిస్నా దత్త జోషి (41), మోహన్ దేవ్ భట్ట (60), బసంత రాజ్ రటాలా (40), పుష్ప అవస్థి (40), దీపక్ రాజ్ జోషి (28), కిసానా దత్త జోషి (46), కేశవ్ రాజ్ భట్ట (27), సుశీల్ జోషి (15) లుగా గుర్తించారు. మరికొందరిని గుర్తించాల్సి ఉంది. కాగా.. క్షతగాత్రులు దాదెల్ధురా, ధన్గడి, బజాంగ్ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇటీవల కాలంలో నేపాల్ లో రోడ్డుప్రమాదాలు గణనీయంగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7669 ప్రమాదాల జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం ఈ సంఖ్య 5 వేలుగా ఉంది. గడిచిన ఏడాదిలోనే 190 మంది రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. రోడ్లపై ప్రయాణించేటపుడు సేఫ్టీ గైడ్ లైన్స్ పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు.






