- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోదాడలో విషాదం.. కొమరబండ చెరువులో అనుమానాస్పద మృతి
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ చెరువులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం కలకలం రేపింది.

దిశ, కోదాడ : కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ చెరువులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం కలకలం రేపింది. స్థానికుల సమాచారం.. మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిని కోదాడ పట్టణం సాయి కృష్ణ థియేటర్ బజార్‌కు చెందిన వంగవీటి జయకృష్ణ (37)గా గుర్తించారు. ఆయన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఉదయం చెరువు వద్ద అనుమానాస్పదంగా శరీరం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు గొంతు భాగంలో కత్తిగాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం కేసు స్వరూపంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం జయకృష్ణ గత కొంతకాలంగా మానసిక వత్తిడితో బాధపడుతున్నారని, అదే కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చెబుతున్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనతో కోదాడ పట్టణంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. జయకృష్ణ మృతి పై పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.






