- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంచన్‌బాగ్‌లో విషాదం.. బకెట్‌లో పడి 16 నెలల చిన్నారి మృతి
హైదరాబాద్ నగరంలోని కంచన్‌బాగ్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి 16 నెలల చిన్నారి మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

దిశ,చంపాపేట్ : హైదరాబాద్ నగరంలోని కంచన్‌బాగ్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి 16 నెలల చిన్నారి మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హఫీజ్‌బాబానగర్ పరిధిలోని సీ-బ్లాక్ ప్రాంతానికి చెందిన కుటుంబం ఓ వేడుకకు హాజరై అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకుంది. ఇంట్లోని పనుల్లో కుటుంబ సభ్యులు నిమగ్నమై ఉండగా, ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటితో నింపి ఉంచిన బకెట్‌లో పడిపోయినట్లు తెలుస్తోంది. కొంతసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా బకెట్‌లో అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లముందే ఆడుకున్న బిడ్డ క్షణాల్లో దూరం కావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారులు ఉన్న ఇళ్లలో నీటి బకెట్లు, టబ్బులు, ఇతర ప్రమాదకర వస్తువుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్షణిక నిర్లక్ష్యం కూడా ఇలాంటి విషాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.






