- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగామ జిల్లాలో విషాదం.. వృద్ధ దంపతులు ఆత్మహత్య
దిశ, జనగామ : జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని బచ్చన్నపేట మండలం చిన్న రామచర్ల గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ, జనగామ : జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని బచ్చన్నపేట మండలం చిన్న రామచర్ల గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య, భర్తలు పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బచ్చన్నపేట గ్రామానికి చెందిన రాంరెడ్డి, లక్ష్మి గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మార్లు చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ తరుణంలో వారికి ఏమి చేయాలో తోచక అర్థరాత్రి ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న బచ్చన్నపేట ఎస్సై హమిద్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.






