- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్ లో విషాదం.. రిమ్స్ లో గిరిజన బాలింత, శిశువు మృతి
దిశ, ఆదిలాబాద్: బిడ్డా పుట్టాడన్న సంతోషం..ఆ కుటుంబానికి ఎంతో సేపు నిలవలేదు.వారు ఊహించని విధంగా నవజాత శిశువు మృతి చెందటాన్ని జీర్ణించుకోలేక విలపిసిస్తున్న

దిశ, ఆదిలాబాద్: బిడ్డా పుట్టాడన్న సంతోషం..ఆ కుటుంబానికి ఎంతో సేపు నిలవలేదు.వారు ఊహించని విధంగా నవజాత శిశువు మృతి చెందటాన్ని జీర్ణించుకోలేక విలపిసిస్తున్న వారికి..బాలింత కూడా కొన్ని గంటల్లోనే మృత్యువాత పడటంతో..ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెల్లితే.. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం శాంతపూర్ గ్రామానికి చెందిన గర్భిణి చిక్రం రుక్మాబాయికి గురువారం పురిటి నొప్పులు రావడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చేరింది. రాత్రి వైద్యులు ఆమెకు రెండో కాన్పు సిజేరియన్ డెలివరీ చేశారు. ఈ క్రమంలో ఆ గిరిజన మహిళ మగ బిడ్డకు జన్మించింది. అయితే ఆ కుటుంబీకుల సంతోషం క్షణికమే అయింది. జన్మించిన కొద్ది సేపటికే ఆ నవజాత శిశువు మృతి చెందాడు. ఇది చూసి అందరూ రోదిస్తున్న క్రమంలో..మరి కొద్ది సేపటికే ఆ బాలింత కూడా మృతి చెందింది. దీంతో ఆ కుటుంబీకుల రోదనలు వర్ణనాతీతం. తల్లి, బిడ్డల మృతదేహాలను రిమ్స్ సిబ్బంది హడావిడిగా శుక్రవారం తెల్లవారు జామునే అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలించారు. బాబుతో సంతోషంగా ఇంటికి వస్తుందనుకున్న రుక్మాబాయి ఇలా విగత జీవిగా రావడం గ్రామస్తులను కలచి వేసింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లి, బిడ్డ మృతి చెందారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జై సింగ్ ను వివరణ కోరగా.. విచారణ చేపడుతున్నామని తెలిపారు.






