Tragedy: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం

by Kema Shiva Kumar |

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

Tragedy: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భారీ వర్షం కారణంగా ద్వారక (Dwaraka)లోని ఖర్జరి కెనాల్ (Kharkhari Canal) గ్రామంలో ఓ వ్యవసాయ భూమిలో నిర్మించిన ట్యూబ్‌వెల్ (Tubewell) గదిపై భారీ వృక్షం కూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా జ్యోతి (Jyoti) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త అజయ్‌ (Ajay) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం (Postmortem) నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Next Story