విషాదం.. పెళ్లి సంబంధం కుదరడం లేదని కానిస్టేబుల్​ ఆత్మహత్య..

by Disha Web Desk 11 |
విషాదం.. పెళ్లి సంబంధం కుదరడం లేదని కానిస్టేబుల్​ ఆత్మహత్య..
X

దిశ, పరిగి: పెళ్లి సంబంధం కుదరడం లేదని ఓ కానిస్టేబుల్​ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిగి ఎస్​ఐ పి.విఠల్​ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం రూప్​ ఖాన్​ పేట్​ గ్రామానికి చెందిన ఉప్పరి వెంకటేశం హైదరాబాద్​ లోని కానిస్టేబుల్​ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే స్వగ్రామానికి వచ్చి సోమవారం తెల్లవారు జామున ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు. ఇది గమనించిన అతని తల్లి బయటికి వెళ్తున్నాడు అనుకుంది. కొద్దిసేపటి తర్వాత గ్రామస్తులు వచ్చి నీ కొడుకు మీ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడంటూ తెలిపారు.

వెంటనే గ్రామస్తులంతా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఉరేసుకొని మృతి చెందిన కానిస్టేబుల్​ ఉప్పరి వెంకటేశం శవాన్ని పరిశీలించారు. అనంతరం తల్లి ఉప్పరి రాములమ్మను నీ కొడుకు ఎందుకు ఉరేసుకొని ఉంటాడని అడుగగా ఈ మధ్య కాలంలో పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరడం లేదంటూ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడేమో అని తెలిపింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.


Next Story