Tragedy: నగరంలో తీవ్ర విషాదం.. ఉరేసుకుని టెన్త్ విద్యార్థి బలవన్మరణం

by Kema Shiva Kumar |

విద్యార్థులు రోజురోజుకు సంయమనం కోల్పోతున్నారు.

Tragedy: నగరంలో తీవ్ర విషాదం.. ఉరేసుకుని టెన్త్ విద్యార్థి బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులు రోజురోజుకు సంయమనం కోల్పోతున్నారు. బంగారు భవిష్యత్తును కళ్లెదుటే పెట్టుకుని ప్రేమలో విఫలమై ఒకరు, పరీక్షల్లో ఫెయిల్ అవుతామనే భయంతో మరొకరు ఇలా.. వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారిపైనే ఆశలు పెట్టుకున్న కన్నవారికి తీరని కడుపు కోతను మిగుల్చుతున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి పది పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదం ఘటన హైదారాబాద్ (Hyderabad) నగరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. అల్వాల్ (Alwal), వెస్ట్ వెంకటాపురం (West Venkatapuram) ప్రాంతానికి చెందిన మంజుల చిన్న కుమారుడు సంజయ్ కుమార్ (15) వర్గల్ ప్రభుత్వ బాలుర వసతి గృహం (Vargal Government Boys' Hostel)లో పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవలే పరీక్షలు కూడా రాశాడు. సెలవులకు తన తల్లి దగ్గరికి వచ్చిన సంజయ్ కుమార్ (Sanjay Kumar) పరీక్ష ఫలితాలు మరో రెండు, మూడు రోజుల్లో వస్తాయని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. అనంతరం తాను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాననే భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్ రూంలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story