- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tragedy: మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో పదేళ్ల చిన్నారి మృతి
by Kema Shiva Kumar |
గుండెపోటు (Heart Attack)తో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లాలో (Manchiryala District) చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గుండెపోటు (Heart Attack)తో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లాలో (Manchiryala District) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రోటిగూడ (Rotiguda) గ్రామానికి చెందిన నాగరాజు, అనూష దంపతులకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. అందులో కూతురు సమన్విత స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. అయితే, గురువారం ఉదయం తనకు ఛాతీలో నొప్పి వస్తుందని చిన్నారి తల్లిదండ్రలకు తెలిపింది. దీంతో వారు సమన్వితను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. చిన్న వయసులో కూతరు మరణాన్ని తుట్టుకోలేని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. వారి రోదనలు చూసిన గ్రామస్తులంతా కన్నీరు పెట్టుకున్నారు.
Next Story






