- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tragedy: ఆ జిల్లాలో తీవ్ర విషాదం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
మహిళా కానిస్టేబుల్ (Woman Constable) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వరంగల్ జిల్లా (Warangal District) కాజీపేట దర్గా (Kazipet Dargah) ప్రాంతంలో ఇవాళ చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మహిళా కానిస్టేబుల్ (Woman Constable) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వరంగల్ జిల్లా (Warangal District) కాజీపేట దర్గా (Kazipet Dargah) ప్రాంతంలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన అర్చన (Archana) మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. కాగా, 2022 అర్చనకు వివాహం కాగా.. భార్యాభర్తల మధ్య తీవ్ర మనస్పర్ధలు రావడంతో కోర్టు ఆదేశాల మేరకు విడాకులు తీసుకున్నారు. అయితే, గత మూడేళ్లుగా ఎలాంటి తోడు లేక అర్చన ఒంటరిగా మానసిక వేదన అనుభవిస్తూ పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






