Tragedy: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి, ఒకరి గల్లంతు

by Shiva |
Tragedy: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి, ఒకరి గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్: కారు కాలువలోకి దూసుకెళ్లి ఇద్దరు దుర్మరణం పాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh State)లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseem District)లో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం‌ (Vishakhapatnam)కు చెందిన విజయ్ కుమార్ కుటుంబం కారులో అరకు వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే కారు పి.గన్నవరం (P.Gannavaram) మండల పరిధిలోని ఉడిముడి (Udimudi) వద్దకు చేరుకోగానే అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో విజయ్ కుమార్ భార్య ఉమ, కొడుకు మనోజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కుమారుడు రిషి కాలువలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అతి కష్టం మీద విజయ్ కుమార్ ఒడ్డుకు చేరుకున్నాడు. తన కళ్లెదుటే భార్య, కొడుకు కాలువలో పడి ప్రాణాలు కోల్పోడంతో విజయ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. స్థానికల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల రంగంలోకి దింపి రిషి జాడ కోసం వెతుకుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed