ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి

by Bhanu |

హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని పెద్ద అంబర్‌పేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది.

ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి
X

దిశ, వనస్థలిపురం: హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని పెద్ద అంబర్‌పేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌ రింగురోడ్డు సర్వీస్‌ రోడ్డులో ఆగి ఉన్న టిప్పర్‌ను బైకు ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ట్రాఫిక్​కానిస్టేబుల్‌ స్పాట్​లోనే మృతిచెందాడు. హయత్​నగర్ ​సీఐ నాగరాజు గౌడ్ ​తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న రమావత్​మాన్ సింగ్ (43) గురువారం సాయంత్రం విధులు ముగించుకుని తొర్రూర్ లోని తన నివాసానికి బయలుదేరాడు.

ఔటర్​రింగ్​రోడ్డు సర్వీస్​రోడ్డులో వస్తుండగా.. పెద్ద అంబర్​పేట వద్దకు రాగానే ముందు వెళ్తున్న టిప్పర్ లారీ డ్రైవర్ ఎలాంటి ఇండికేటర్​లేకుండా నిర్లక్ష్యంతో సడన్ బ్రేక్ వేయడంతో బైక్​టిప్పర్​వెనకాల బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమై మాన్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు.

సంఘటనా స్థలంలో ఉన్నవారు డయల్​100కు కాల్​చేయడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ నాగరాజు గౌడ్​తెలిపారు. తెలిపారుసమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మాన్‌సింగ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు.

Next Story