తుంగభద్ర వంతెనపై ఘోర ప్రమాదం.. స్పాట్లో ఏడుగురు మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-15 11:58:29  IST  )

తుంగభద్ర వంతెనపై ఘోర ప్రమాదం.. స్పాట్లో ఏడుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కొప్పళ తాలూకాలోని మునిరాబాద్ సమీపంలో తుంగభద్ర వంతెనపై జరిగిన ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం చెందారు. బ్రిడ్జి పై వెళ్తున్న ట్రాక్టర్ ను ట్యాంకర్ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మరో 10 మందికి పైగా గాయాలు కాగా.. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులను గుర్తించే పనిలో పడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హోస్పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా మర్లాయనహళ్లి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ప్రసిద్ధ హులిగెమ్మ అమ్మవారి ఆలయానికి దైవదర్శనార్థం వెళ్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. కాగా.. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై మునిరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story