- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. కీలక నిందితుడు అజయ్ కుమార్ సుగంధ్ అరెస్ట్
తిరుమల (Tirumala) కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు కేసులో కీలక నిందితుడిగా ఉన్న A16 అజయ్ కుమార్ సుగంధ్ (Ajay Kumar Sugandh)ను సిట్ (SIT) అరెస్ట్ చేసింది. అయితే, అజయ్ కుమార్ మోన్ గ్లిసరైడ్స్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను బోలే బాబా కంపెనీకి సరఫరా చేసినట్లుగా విచారణలో బట్టబయలమైంది. ఆ రసాయనాలను పామాయిల్ (Palm oil) తయారీలో వినియోగించి, అదే పామాయిల్‌ను నెయ్యి పేరుతో తిరుమల లడ్డూల తయారీ కోసం సరఫరా చేశారని.. ఆ నెయ్యినే లడ్డూల తయారీలో ఉపయోగించినట్లుగా సిట్ పేర్కొంది. దీంతో లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 90 శాతం వరకు పామాయిల్ ఉన్నట్లుగా తేలింది. గత ఏడేళ్లుగా బోలే బాబా కంపెనీ (Bole Baba Company)కి పామాయిల్ తయారీలో అవసరమైన కెమికల్స్‌ను అజయ్ కుమార్ సరఫరా చేస్తున్నట్లుగా సిట్ అధికారుల గుర్తించి అందుకు సంబంధఇంచి ఆధారాలను సైతం సేకరించారు. దీంతో నిందితుడిని నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఈనెల 21 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.






