- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్‌కు ఓటేయాలని నేను చెప్పలేదు: మంత్రి తుమ్మల
బీఆర్ఎస్ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageswara Rao) సీరియస్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageswara Rao) సీరియస్ అయ్యారు. ఈ మేరకు తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలంటూ కమ్మ సంఘాలకు తాను చెప్పినట్లు బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను మెప్పించి ఎన్నికల్లో గెలవాలని కానీ.. ఇలా తప్పుడు ప్రచారాలతో కాదని మంత్రి తుమ్మల హితవు పలికారు. తప్పుడు వార్తలను నమ్మొద్దని కమ్మ సంఘాలు, కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. కాగా, జూబ్లీహిల్స్ ఉపఉన్నికలు హీట్ పెంచుతున్నాయి. గెలుపు కోసం అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పడరాని పాట్లు పడుతున్నాయి. మూడు పార్టీలు సర్వ శక్తులను ఒడ్డి ప్రచారం చేస్తున్నాయి. పోలింగ్‌కు కేవలం నాలుగు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి.






